అచ్చంపేట: ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చి న మరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన అర్జున్, వెంకటయ్య కుటుంబ సమేతంగా శ్రీశైలం దైవదర్శనానికి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి టవేరా వాహనంలో వెళ్తున్నారు. బిజినేపల్లి మండలం వెలుగొండకు చెందిన వంశీ(24), తిమ్మాజిపేట మండలం చేగుంటకు చెందిన మహేష్(30)లు ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న వంశీ, మహేష్‌లు హాజీపూర్ నుంచి వెళ్తూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోగా డిండి వైపు నుంచి వస్తున్న టవేరా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే టవేరా డ్రైవర్ వీరప్పకు గాయాలవడంతో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. వంశీకి తల్లిదండ్రులతోపాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.


