● రెండో స్థానంలో నిలిచిన
వరంగల్ జట్టు
● పాలమూరు, ఆదిలాబాద్
జట్లకు తృతీయ స్థానం
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. ఖమ్మంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న టోర్నీ ఆదివారం ముగిసింది. ఈ మేరకు ఫైనల్స్‌లో ఖమ్మం– వరంగల్ జట్లు తలపడగా మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరకు ఖమ్మం 11 గోల్స్ సాధించగా, వరంగల్ 8 గోల్స్‌కే పరిమితం కావడంతో ఖమ్మం బాలికలు విజయం దక్కించుకున్నారు. ఇక మూడో స్థానం కోసం మహబూబ్‌నగర్– ఆదిలాబాద్ జట్లు తలపడగా సమాన పాయింట్లు రావడంతో ఇరు జట్లకు ట్రోఫీ అందజేశారు. డీవైఎస్ఓ సునీల్‌రెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేష న్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, హ్యాండ్‌బాల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌రెడ్డి, వరికూటి మోహన్‌తోపాటు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు.


