ి | - | Sakshi
Sakshi News home page

ి

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

ఆందోళనగా ఉంది.. పాల దిగుబడి తగ్గింది.. పశువుల సంరక్షణకు చర్యలు పాల దిగుబడిపై ప్రభావం.. ధరల భారంతో దిగులు

ప్రత్యామ్నాయ

ఏర్పాట్లపై దృష్టి

గడ్డు కాలం..!

● వరి కోతల వేళ పెరుగుతున్న

ఎండుగడ్డి ధరలు

● రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత

● పాల దిగుబడిపైనా

ప్రభావం చూపే అవకాశం

● ముందస్తు కార్యాచరణతో

పశుసంవర్ధక శాఖ

–8లో u

నాకు ఏడు ఆవులు, ఐదు గేదెలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సహజంగా లభించే పశుగ్రాసం దొరకడం లేదు. గతంలో వరి గడ్డి కట్ట రవాణా ఖర్చులతో కలిపి రూ.50–60కు లభించేది. ఇప్పుడు అదే కట్టకు రూ.130 చెల్లించాల్సి వస్తోంది. గడ్డి కొరతకు తోడు దాణా ఖర్చులు పెరగడంతో పాడి పరిశ్రమ నిర్వహణ కష్టమవుతోంది. ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు సబ్సిడీపై పశుదాణా పంపిణీ చేసి, పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలి. – అస్గర్‌అలీ,

పాడి రైతు, నవాబుపేట మండలం

వర్షాలు లేక భూమిపై పచ్చిగడ్డి కనిపించడం లేదు. నేను సాగు చేసిన నాలుగు ఎకరాల్లో నీళ్లు లేక వరి ఎండిపోయింది. నాకు ఐదు గేదెలు ఉన్నాయి. గతంలో ఉదయం, సాయంత్రం కలిపి 14 లీటర్ల పాలు వచ్చేవి. పచ్చిగడ్డి తిన్నప్పుడు గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి. సంక్రాంతి తర్వాత ఎండుగడ్డితోనే మేపుతాం. కానీ, ఈసారి వర్షాలు లేక ఇప్పటి నుంచే ఎండుగడ్డిపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో పాల దిగుబడి కూడా తగ్గిపోయింది. మున్ముందు పశువులకు మేత ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదు.

– వెంకట్రాములు, పాడిరైతు,

వేపూర్‌ గ్రామం, హన్వాడ మండలం

జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో పశుగ్రాసం 3.33 లక్షల మె.ట., అవసరం కాగా.. ప్రస్తుతం 3.45 లక్షల మె.ట., లభ్యత ఉంది. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ, పంట అవశేషాల సంరక్షణ, వ్యక్తిగత పశుగ్రాసం ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నీటి తొట్టెల మరమ్మతు, అవసరమైన చోట కొత్త తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధుల నివారణకు టీకాలు, నులిపురుగుల నివారణ కార్యక్రమాలు చేపడుతున్నాం.

– శివానందస్వామి,

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

ఎన్‌నినో ఎఫెక్ట్‌తో పాడి రైతులకు కొత్త కష్టాలు

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): వానలు లేక పంటలు ఎండిపోతున్నాయి.. పశువులకు మేత కరువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులు పాడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా వరి కోతల సమయంలో అందుబాటులోకి వచ్చే గడ్డి పశువులకు ప్రధాన ఆహారంగా ఉపయోగపడుతుంది. అయితే ఈసారి కరువు పరిస్థితులు, పంటల దిగుబడిపై అనిశ్చితి నేపథ్యంలో పశుగ్రాసం లభ్యత, ధరలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రానున్న యాసంగి సీజన్‌లో మేత కొరత తీవ్రతరం కావచ్చని అంచనాలతో పశుసంవర్ధకశాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. పశువులకు మేత, తాగునీరు అందించడంతోపాటు పాల ఉత్పత్తిపై వాతావరణ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.

పశువులకు తగినంత పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందకపోతే పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. చలికాలంలోనూ సాధరణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదైతే పశువులపై వేడి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే జిల్లాలో ప్రస్తుతం పాల దిగుబడిపై ఎంతమేర ప్రభా వం పడిందన్న దానికి నిర్దిష్ట గణాంకాలు అందుబాటులో లేవు. వాతావరణ పరిస్థితులు, పశువుల ఆరోగ్యం, మేత నాణ్యతను బట్టి ప్రభావం మారుతుంది. పాడి రైతులు ముందస్తుగా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడం, పశువులకు నిరంతరం నీరు అందించడం, నీడ కల్పించడం అవసరం.

పాడి పశువుల పోషణలో వరి గడ్డి కీలక పాత్ర పోషిస్తుంది. కోతల అనంతరం పొలాల్లో లభించే గడ్డిని రైతులు నిల్వ చేసుకుని ఏడాది పొడవునా వినియోగిస్తుంటారు. గతంలో సొంత పొలాల్లో పండిన వరి నుంచి గడ్డిని సేకరించి పశువులకు మేతగా ఉపయోగించేవారు. అవసరమైనప్పుడు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మేత అవసరాలు పెరగడం, రవాణా ఖర్చులు తోడవడంతో గడ్డి కొనుగోలు పాడి రైతులకు భారంగా మారుతోంది. ఈసారి కోతల సమయంలోనూ గడ్డి ధరలు ఏ మేరకు ఉంటాయన్నది కీలకంగా మారింది. దిగుబడులు తగ్గితే అందుబాటులోకి వచ్చే గడ్డి పరిణామం తగ్గి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పశుగ్రాస కొరతను నివారించేందుకు వ్యక్తిగత పశుగ్రాస ప్లాట్ల ఏర్పాటు, పంట అవశేషాల సంరక్షణ, సబ్సిడీపై పశుగ్రాస విత్తనాల పంపిణీకి శాఖ ప్రణాళికలు రూపొందించింది. పశువులకు తాగునీరు అందించేందుకు నీటి తొట్టెల మరమ్మతు, అవసరమైన చోట కొత్త తొట్టెల ఏర్పాటుపైనా దృష్టి సారించింది. వ్యాధుల పర్యవేక్షణ, టీకాలు నులిపురుగుల నివారణ, అత్యవసర పశువైద్య శిబిరాల నిర్వహణకు చర్యలు చేపడుతోంది. పశుగ్రాస నిల్వలు, ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. రైతులకు అవసరమైన సూచనలు అందిస్తే కరువు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే వీలుంది.

జిల్లాలో పశుసంపద ఇలా..

గోజాతి 89,500

గేదె జాతి 79,102

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement