బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీటీం నిరంతరం నిఘా పెడుతుందని, వేధింపులకు గురిచేసిన.. పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ నెల రోజుల్లో షీటీంకు మొత్తం 20 ఫిర్యాదులు రాగా వాటిలో 9 మందికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం జరిగిందని, 10 ఈ–పెట్టీ కేసులు, ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే 16 మందిని వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 20 అవగాహన కార్యక్రమాలతోపాటు 50 హాట్‌స్పాట్‌ ప్రాంతాలను సందర్శించినట్లు చెప్పారు. అన్ని రకాల పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, పోక్సో చట్టం, గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌, సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

రేపు సబ్‌ జూనియర్‌

కబడ్డీ జట్టు ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నగరంలోని ఇండోర్‌ స్టేడియంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి జిల్లా సబ్‌ జూనియర్‌ బాలుర కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు శాంతికుమార్‌, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చే సబ్‌ జూనియర్‌ బాలురు 13.12.2010 తర్వాత పుట్టినవారై, 60 కిలోల లోపు బరువు ఉండాలని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ మెమో, జనన ధ్రువీకరణ పత్రంతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. ఎంపికయ్యే జిల్లా జట్టు వికారాబాద్‌ జిల్లా ఎన్నపల్లి సాకేత్‌నగర్‌లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో

చాంపియన్‌గా నిలవాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడాపోటీల్లో జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలవాలని జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం అండర్‌–19 విభాగం ఉమ్మడి జిల్లాస్థాయి బాల, బాలికల హ్యాండ్‌బాల్‌ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీ జియావుద్దీన్‌, బాలరాజు, రాంమోహన్‌, ప్రదీప్‌కుమార్‌, అహ్మద్‌ హుస్సేన్‌, అర్చన, నర్సింహులు పాల్గొన్నారు.

ఆర్చరీ పోటీలకు ఎంపిక

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో ఆర్చరీ విభాగం సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ పోటీలకు ఆదివారం ఎంపికలను నిర్వహించారు. ఇందులో ఆరుగురు విద్యార్థులు ఎంపికవగా.. వీసీ శ్రీనివాస్‌ బహుమతులను అందజేశారు. ఇక్కడ ఎంపికై న వారు డిసెంబర్‌లో కర్ణాటకలోని మంగళూరు యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ఓటు బచావో’ ర్యాలీలో పాలమూరు నేతలు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ పేరిట ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్‌అక్తర్‌, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌ యాదవ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement