ఆస్పత్రిమే సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిమే సవాల్‌

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

జడ్చర్ల వందపడకల ఆస్పత్రి నిర్మాణంపై ఎమ్మెల్యే విమర్శలు

వరద ముప్పు లేదు..

నిబంధనల మేరకే..

● క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ స్థల ఎంపికపై మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం

● తాజా, మాజీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం

● వాస్తు గండమా.. వరద ముప్పా..

రాజకీయ విమర్శలా..

అర్థం కాని పరిస్థితి

వివాదాస్పదంగా మారిన జడ్చర్లలోని

వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఇదే..

జడ్చర్ల: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రి రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. ఇందుకు వాస్తు గండమా.. వరద ముప్పా.. రాజకీయ విమర్శలా.. అన్న అంశాలపై సాగుతున్న చర్చలు ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోవాల్సిన సామాన్య ప్రజలు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక సందిగ్ధంలో పడుతున్నారు. దీంతో జడ్చర్ల ఏరియా ఆస్పత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

కీలకమైన విభాగం..

క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ అనేది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన అత్యంత కీలకమైన విభాగం. అలాంటి విభాగం నిర్మాణంలో స్థల ఎంపిక, అత్యవసర వాహనాల రాకపోకలు, రోగులను తరలించే సౌలభ్యం, ఆక్సిజన్‌ సరఫరా, వైద్య పరికరాల ఏర్పాటు, భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంత ముఖ్యమైన విభాగం నిర్మాణం వాస్తు వివాదంతో ముడిపడడంతో ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోతట్టు ప్రాంతం, వరద ముప్పు వంటి ఆరోపణలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నది ఒక ప్రశ్న కాగా.. ప్రస్తుతం నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఉందా.. అన్నది మరో ప్రశ్నగా మారింది.

వంద పడకల ఆస్పత్రికి వరద ముప్పు ఎంతమాత్రం లేదు. భవనానికి ఉత్తర దిశగా వాస్తు ప్రకారంగా ఖాళీ స్థలం ఉండాలి. కానీ, అక్కడ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణం చేపట్టడంతో వాస్తు గండం ఏర్పడింది. భవిష్యత్‌లో మార్చురీని తొలగించి మరో చోట నిర్మించి ఖాళీ స్థలంగా ఉంచితే వాస్తు కుదురుతుంది. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను ఆ పక్కనే ఉన్న అసైన్‌ భూమిలో నిర్మించి ఉంటే బాగుండేది.

– లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జడ్చర్ల

వంద పడకల ఆస్పత్రిని గుంతలో నిర్మించి వాస్తు లేకుండా చేశారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను ఆస్పత్రికి అనుసంధానంగానే నిర్మించాలన్న నిబంధనల మేరకే అక్కడ నిర్మిస్తున్నాం. దూరంగా మరో చోట నిర్మించడానికి నిబంధనలు అడ్డంకిగా మారాయి.

– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement