మహబూబ్‌నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలకు సంబంధించి చేపట్టాల్సిన ముందుస్తు ఏర్పాట్లను శుక్రవారం అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ, జిల్లా యువజన, క్రీడల కార్యాలయ సిబ్బందితో కలిసి ఆయన స్టేడియంను సందర్శించి.. క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన మౌళిక సదుసాయాలు, మైదానాల అభివృద్ధి, మరమ్మతు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రేక్షకులు, క్రీడాకారుల సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోటీల నిర్వహణకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.


