ఆంగ్ల భాషపై ఆసక్తి పెంచడానికి స్పెల్‌బీ పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. చదువుకునే సమయంలో ఎదురయ్యే కష్టమైన పదాలను కూడా ఇలాంటి పరీక్షల ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. ఇలాంటి పోటీ పరీక్షలో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.
– సహస్ర, 9 జాస్మిన్, కేపీఎస్ పాఠశాల
సవాల్‌గా అనిపించింది..
సాక్షి నిర్వహించిన స్పెల్–బీ పరీక్ష ఆసక్తికరంగా, సవాల్‌గా అనిపించింది. పరీక్షలో పాల్గొనడం ద్వారా తమకు తెలిసిన పదాలను గుర్తు చేసుకోవడంతో పాటు కొత్త పదాలు నేర్చుకున్నాను. భవిష్యత్‌లో ఇలాంటి మరిన్ని పోటీల్లో పాల్గొని సత్తాచాటుతా.
– సాత్విక్, 10 జాస్మిన్, కేపీఎస్ పాఠశాల
●


