● హాజరుకానున్న పది ఉమ్మడి జిల్లాల జట్లు
● 160మంది క్రీడాకారులు, 20 మంది అఫీషియల్స్
● మూడు మైదానాల్లో మ్యాచ్‌ల నిర్వహణ
● ఏర్పాట్లు చేసిన ఎస్‌జీఎఫ్ నిర్వాహకులు
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మరో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు వేదిక కానుంది. నగరంలో శనివారం నుంచి నవంబర్ 3వ తేదీ వరకు 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాలుర క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. టోర్నమెంట్‌కు సంబంధించి నిర్వాహక ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
టోర్నీలో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాల జట్లు
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలైన మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండకు చెందిన బాల, బాలికల జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీలో 160 మంది బాలురు, 20 మంది అఫీషియల్స్ హాజరవుతున్నారు. క్రీడాకారులకు నగర శివారులోని (అల్లీపూర్ సమీపంలోని) క్రికెట్ మైదానం, స్కౌట్స్ గైడ్స్ భవన్‌లో వసతి సౌకర్యం కల్పించనున్నారు.
ఉమ్మడి జిల్లా బాలుర క్రికెట్ జట్టు
జి.జశ్వంత్, డి.అభినవ్, సిద్ధార్థ, భీరేందర్, ఎండి.అఫ్పాన్, సయ్యద్ ఫైజాన్, శామ్యుల్ జోసెఫ్, అఖిల్ టెండుల్కర్, సీహెచ్.అభినవ్, మణిచరణ్, ఎన్.గగన్, పి.రామ్‌కుమార్‌చారి, ఎండి.ముస్తఫా, శివ, రాజేష్, కేతేశ్వర్.
టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తాం
జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీని అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తాం. ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. మూడు మైదానాల్లో మ్యాచ్‌లు జరగుతాయి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– వేణుగోపాల్, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్‌నగర్


