పీయూ అభివృద్ధికి సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

పీయూ అభివృద్ధికి సమష్టి కృషి

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: యూనివర్సిటీ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో వీసీగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లా, ఇంజనీరింగ్‌, ఐసీ డిపార్ట్‌మెంట్లలో 100 శాతం ప్రవేశాలు సాధించామన్నారు. పీయూ అభివృద్ధి, నాణ్యమైన విద్య, రీసెర్చ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన వారికి వెంటనే ఉద్యోగాలు పొందే విధంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వారికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పీయూ ప్రగతి కోసం టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేయాలని, అందరి భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ వీసీ శ్రీనివాస్‌ నాయకత్వంతో పాటు అధ్యాపకులు, సిబ్బంది సహకారం ఎంతో అవసరం అన్నారు. విద్యాప్రమాణాల పెంపు, నాణ్యమైన విద్యకు కృషి చేయడంతో పాటు ఉద్యోగాల కల్పనకు కూడా కృషి చేస్తామని సూచించారు. ఈ సందర్భంగా పీయూలో రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు పలు అంశాలపై న్యూస్‌లెటర్‌ బుక్‌తో పాటు వీసీకి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, ప్రవీణ, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, కుమారస్వామి, అర్జున్‌కుమార్‌, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి

మాదకద్రవ్యాలను నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన నషా ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజం కూడా పాడయ్యే అవకాశం ఉందని, దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకు రావాలని, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement