హైవేపై ఘోర ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

హైవేపై ఘోర ప్రమాదం

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

● డీసీఎం, వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొని డ్రైవర్‌ దుర్మరణం

● కొత్తకోట సమీపంలోని

అమడబాకుల స్టేజీ వద్ద ఘటన

కొత్తకోట రూరల్‌: జాతీయ రహదారి–44పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. హైవేపై చెట్లకు నీళ్లు పట్టే పనుల్లో భాగంగా వాటర్‌ ట్యాంకర్‌ వద్ద పనిచేస్తుండగా.. వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామానికి చెందిన ఉల్చాల సురేంద్రనాథ్‌రెడ్డి(45) తన సమీప బంధువైన కాట్‌రెడ్డి సుబ్బారెడ్డి వద్ద గత తొమ్మిదేళ్లుగా వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హైవే పనుల నిమిత్తం సుబ్బారెడ్డి వాటర్‌ ట్యాంకర్‌ను కాంట్రాక్టు పనులకు కేటాయించడంతో సురేంద్రనాథ్‌రెడ్డి నెల రోజులుగా జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోని అమడబాకుల స్టేజీ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారి–44పై హైవే పనులు జరుగుతుండగా సురేంద్రనాథ్‌రెడ్డి వాటర్‌ ట్యాంకర్‌ను అక్కడికి తీసుకువచ్చాడు. వాటర్‌ ట్యాంకర్‌ను నిలిపి, రోడ్డు పనుల కోసం వాటర్‌ బారికేడ్‌ను ఏర్పాటు చేస్తుండగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఐచర్‌ డీసీఎం (కొరియర్‌ పార్సల్‌ వ్యాన్‌) వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేంద్రనాథ్‌రెడ్డి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై సురేంద్రనాథ్‌రెడ్డి తండ్రి ఉల్చాల వెంకటేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement