మా స్కూల్‌లో సారోళ్లు చెప్పిన పాఠాలను విని చక్కగా చదువుకుంటు న్నాం. లీజర్ టైంలో మా స్కూల్‌లోని తోట ను చూసుకుంటున్నాం. మా స్కూల్‌లో మాకు కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేయడంతో రోజూ కంప్యూటర్లను కూడా వాడుతూ కంప్యూటర్ విద్యను కూడా నేర్చుకుంటున్నాం. తండా నుంచి నడవకుండ పాఠశాలకు వెళ్లివచ్చేందుకు ఫ్రీగా మాకు ఆటో సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
– కార్తీక్‌నాయక్, 5వ తరగతి,
బచ్చిరెడ్డికుంట తండా
మా పాఠశాలలో నా తోపాటు మా సహ ఉపాధ్యాయులు చేస్తు న్న కృషితో చక్కటి విద్యను అందించడంతోపాటు సేంద్రియ సాగుపై అవగాహనను కల్పిస్తున్నాం. గతంలో 80మంది ఉండేవారు. ఇప్పుడు 120మంది వస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో కంప్యూటర్ ఆధారిత విద్య చక్కటి గ్రంథాలయం, ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటు, క్షేత్ర పర్యటనలు, డిజిటల్ బోధనతోపాటు పిల్లలకు ఆహ్లాదమైన పాఠశాల ఆవరణ ఉండేందుకు కూరగాయల సాగు, పండ్లచెట్లను పెంచుతున్నాం. మా పాఠశాలకు ఇప్పటికే రాష్ట్రస్థాయి స్వచ్ఛపాఠశాల అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేవిధంగా కృషి చేస్తున్నాం.
– విష్ణువర్ధన్‌గౌడ్, హెచ్‌ఎం


