కొల్లాపూర్ రూరల్: మండలంలోని కుడికిల్లలో ఉన్న పురాతన రామాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. రామాలయంలో దొంగలు అంతా తిరుగుతూ ఆలయ ఆవరణలో ఉన్న శివుడి గర్భగుడి ఎదుట ఉన్న ప్రాచీన నంది విగ్రహాన్ని అపహరించుకపోయారు. ఈ విగ్రహం 500 ఏళ్ల క్రితం నుంచి ఉన్నదని గ్రామపెద్దలు తెలిపారు. రామాలయంలో తూర్పు భాగంలో చిన్న గేటు ఉంది. ఆ గేటుకు ఉన్న తాళం పగలగొట్టి దుండగులు లోపలికి వచ్చి శివుడి గర్భగుడికి ఉన్న తాళం కూడా పగలగొట్టి దాదాపు 45కిలోల పరిమాణంలో ఉన్న నంది విగ్రహాన్ని తీసుకెళ్లారు. బుధవారం ఉదయం ఆలయ కమిటీ నిర్వాహకులు వచ్చి చూడగా.. నంది విగ్రహం లేకపోవడంతో ముందుగా గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శివకుమార్ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలతో కలిసి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో చోరీ ఘటనపై ఎస్‌ఐ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ శంకర్, ఎస్‌ఐ ఆనంద్ చేరుకొని పరిశీలించా రు. ఆలయంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చోరీకి వచ్చిన వా రి ఆచూకీని సీసీ ఫుటేజ్‌లో పరిశీలించారు. కే సు నమోదు చేసుకొని సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షిస్తామని తెలిపారు.


