పీయూ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

పీయూ ఫలితాలు విడుదల

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎంఫార్మసీ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ కోర్సుల ఫలితాలను వీసీ శ్రీనివాస్‌ మంగళవారం విడుదల చేశారు. ఎంఫార్మ సీ సెమిస్టర్‌–2కు 76 మంది విద్యార్థులు హాజ రు కాగా.. 59 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎల్‌ఎల్‌ఎం సెమిస్టర్‌–2లో17 మందికి 14 మంది, ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌–2లో 226 మందికి 148 మంది, ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌–4లో 177 మందికి 117 మంది, ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌–5 19 మందికి ఎనిమిది మంది ఉత్తీర్ణత పొందారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పాల్గొన్నారు.

31న ‘ఆర్చరీ’ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ యూనివర్సిటీ ఆర్చరీ పోటీలకు మహిళలు, పురుషుల విభాగాల్లో ఈనెల 31న ఎంపికలు నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని సూర్య ఆర్చరీ అకాడమీలో ఉదయం 9.30 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు డిసెంబర్‌ 15 నుంచి 22 వరకు అసోంలోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీలో నిర్వహించే ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.

నేడు అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో నేడు (బుధవారం) స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 విభాగం బాల బాలికల ఉమ్మడి జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌ ఎంపికలు జరుగుతాయని అండర్‌–19 ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్‌, ఎస్‌ఎస్‌సీ మెమోతో ఆ రోజు ఉదయం 9 గంటలకు మినీ స్టేడియంకు చేరుకోవాలని కోరారు. మిగతా వివరాల కోసం 9959220075 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement