12 నుంచి కాంట్రాక్టు కార్మికుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

12 నుంచి కాంట్రాక్టు కార్మికుల పోరుబాట

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జీజీహెచ్‌లలో పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌ సూపర్‌వైజర్‌ విభాగాలలో పనిచేసే కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ వచ్చే నెల 12 నుంచి పోరుబాట పడుతున్నామని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్‌ చెప్పారు. మంగళవారం ఎంజీజీహెచ్‌ ప్రాంగణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల జీవన ప్రమాణాలు, సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం కాలం చెల్లిన టెండర్లను రద్దు చేయకుండా సుమారు ఐదేళ్లుగా పాత ఏజెన్సీలనే కొనసాగించడం తగదన్నారు. ఎంజీజీహెచ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతినెలా 1న వేతనాలు చెల్లించాలని, వారాంతపు సెలవులు కాకుండా పండుగ, జాతీయ, ఆర్జిత సెలవులు 23 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏటా ఒక నెల బోనస్‌ చెల్లించాలని, కార్మికులపై వేధింపులు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రంగన్న, ఎస్‌.దేవానంద్‌, బి.చెన్నయ్య, బాలకోటి, భీమయ్య, మన్యం, పద్మ, సత్యమ్మ, నాగమ్మ, సువర్ణ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement