ప్రతిభావంతులై దేశానికి మంచి పేరు తేవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులై దేశానికి మంచి పేరు తేవాలి

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

● ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

● 750 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేత

జెడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌): విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని ప్రతిభావంతులుగా ఎ దిగి కుటుంబానికి, దేశానికి మంచి పేరు తీసుకురా వాలని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా రంగ కార్మికుల పిల్లలైన 750 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో, కమర్షియల్‌ వా హనాల డ్రైవర్లు, రవాణా రంగ కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. హైస్కూల్‌ తోపాటు ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ వి ద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం ద్వారా సంస్థ వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన వి ద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులను సమాజానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే విద్య వంటి రంగాలపై ఖర్చు చేయాలని సూచించారు. విద్యతోనే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పే ర్కొంటూ, విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న శ్రీరామ్‌ ఫైనాన్స్‌ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, ముడాచైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నా యకులు సిరాజ్‌ఖాద్రీ, గిరిగౌడ్‌, వెంకటేష్‌, తాహె ర్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తెలంగాణ బిజినెస్‌ హెడ్‌ మ హిపాల్‌రెడ్డి, జోనల్‌సేల్స్‌ హెడ్‌ లక్ష్మణ్‌కుమార్‌, ఉ ద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement