‘రైతాంగాన్ని ఆదుకోకుంటే వలసలు తప్పవు’ | - | Sakshi
Sakshi News home page

‘రైతాంగాన్ని ఆదుకోకుంటే వలసలు తప్పవు’

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఎల్‌నినో ప్రభావంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, లేదంటే ఉమ్మడి పాలమూరు ప్రజలకు మళ్లీ వలసలు శరణ్యం అవుతాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జురాల పరిధిలో 2014లో 68,084 ఎకరాలు ఆయకట్టు ఉంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 1,04,741 ఎకరాలకు పెంచిందన్నారు. కోయిసాగర్‌ పరిధిలో 2014లో 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే 38,250ఎకరాలకు, భీమా పరిధిలో 12 వేల ఎకరాల నుంచి 1.58 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్‌ పరిధిలో 23,344 ఎకరాల నుంచి 87,500 ఎకరాలకు, నెట్టెంపాడు పరిధిలో 2,500 ఎకరాల నుంచి 1.42 లక్షల ఎకరాలకు, కల్వకుర్తి పరిధిలో 13 వేల ఎకరాల నుంచి 3.5 లక్షల ఎకరాలకు, చెరువులు, కుంటల కింద 84,410 ఎకరాల నుంచి 1.88 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌ పూర్తయితే అదనంగా 12 లక్షల ఎకరాలకు సాగు నీరు వస్తుందన్నారు. రేవంత్‌ సర్కార్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా జిల్లాలో ఆయకట్టు రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో వాల్యనాయక్‌, రాజేశ్వర్‌ గౌడ్‌, నర్సింహులు, శివరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement