ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగేశ్వర్‌రావు హెచ్చరించారు. సోమవారం స్థానిక మెట్టుగడ్డలోని సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 అక్టోబర్‌ నుంచి లీవ్‌ ఎన్‌కాష్‌మెంట్‌, 2017, 2021 పీఆర్‌సీ బకాయిల చెల్లింపుపై ఎన్నో సర్క్యులర్లు జారీ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. అంతకుముందు విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన బయోడేటా ఫారంను విడుదల చేశారు. కార్యక్రమంలో ‘ఫోరం’ నాయకులు సయ్యద్‌ ఫరీద్‌, నర్సింహారెడ్డి, జి.బి.పాల్‌, ఎ.రాజసింహుడు, వి.రామచంద్రయ్య, భగవంతు, నాగాంజనేయులు, ఉమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

● బంగారు, వెండి నగలు అపహరణ

జడ్చర్ల: తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి బంగారు, వెండి నగలను అపహరించారు. ఈ ఘటన జడ్చర్ల పట్టణంలోని గౌరీశంకర్‌ కాలనీలో చోటుచేసుకుంది. సీఐ కమలాకర్‌ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన కొత్తకాపు శ్రీమతమ్మ ఆదివారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆమెకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటికి చేరుకుని పరిశీలించగా, బీరువాలో దాచిన 48 గ్రాముల బంగారు నగలు, 17 తులాల వెండి నగలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement