ఓటు చోరీపై ప్రజల్లో చైతన్యం తేవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు చోరీపై ప్రజల్లో చైతన్యం తేవాలి

Oct 27 2026 12:09 AM | Updated on Oct 27 2026 12:09 AM

● ‘సర్‌’కు వ్యతిరేకం కాదు.. విధానం సరిగా లేదు

● ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్రదాస్‌

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఓట్ల చోరీపై క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్రదాస్‌ పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మూడో విడతగా ‘సర్‌శ్రీకు వ్యతిరేకంగా ఓట్‌ బచావో.. దేశ్‌కు బచావో పేరిట కార్యక్రమాన్ని విస్తృతం చేయాలన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ‘సర్‌’కు పార్టీ వ్యతిరేకం కాదని.. చేపట్టిన విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించి ఎన్నో ఆధారాలు లభించాయన్నారు. బీజేపీకి అనుకూలంగా లేరనే నెపంతో చాలా మంది ఓట్లను తొలగించారని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్వర్‌ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని.. ఈ హక్కు ను సాధించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ఇవే అంశాలపై దేశవ్యాప్తంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహూల్‌గాంధీ కొన్ని నెలలుగా పోరాడుతున్నారన్నారు. ‘సర్‌’పై వచ్చే నెల 1న ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీకి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, టీపీసీ సీ కోఆర్డినేటర్‌ రాచమల్ల సిద్దేశ్వర్‌, సిటీ కోఆర్డినేటర్‌ రామారావు, డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్‌ ముదిరాజ్‌, ప్రధాన కార్యదర్శి మిథున్‌రెడ్డి, డిప్యూ టీ మేయర్‌ ఎం.సురేందర్‌ రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement