మక్తల్: మండలంలోని దత్త క్షేత్రాన్ని ఆ దివారం సింగర్ మంగ్లీ సందర్శించారు. మొదట కుర్మగడ్డలోని దత్తాత్రేయ స్వామిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం బోటులో దత్త క్షేత్రానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెను ఆలయ కమిటీ చైర్మన్ దత్తప్ప శాలువాతో సత్కరించి జ్ఞప్తికను అందజేశారు. ఈ సందర్భంగా మంగ్లీతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, పట్వారీ అంజి, ఉపసర్పంచ్ రవి పాల్గొన్నారు.
కారు బోల్తా
ఐదుగురికి గాయాలు
వనపర్తి రూరల్: కారు బోల్తా పడి గర్భిణుతో సహా మరో నలుగురికి గాయాలైన ఘటన కంచిరావుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం చో టు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పె బ్బేరు మండలం అయ్యవారిపల్లికి చెందిన గొల్ల శేఖర్ కుటుంబ సభ్యులతో కలసి కారులో వనపర్తి నుంచి వస్తూ మార్గమధ్యంలో కంచిరావుపల్లి దాటిన తర్వాత పెట్రోల్ బంక్ సమీపంలో బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న శేఖర్ భార్య గర్భిణితోపాటు మరో నలుగురికి గాయా లు కాగా, వారిని కడుకుంట్ల 108 వాహనంలో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పత్తి దగ్ధం:
రూ.50 వేల నష్టం
కల్వకుర్తి రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్‌లో నాలుగు క్వింటాళ్ల పత్తి దగ్ధం కావడంతో రూ.50 వేల నష్టం వాటిలినట్లు బాధిత రైతు తాటికొండ శ్రీను వాపోయారు. తనకున్న వ్యవసాయ పొలంలో పత్తి పంట సాగు చేశాడు. దాదాపు 40 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావడంతో ఇంటి వద్ద నిల్వ ఉంచాడు. శనివారం రాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు దానికి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు పత్తి దగ్ధం అవుతున్న విషయాన్ని చూసి వెంటనే రైతుకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన రైతు మంటలు ఆర్పడంతో పాటు మిగతా పత్తిని పక్కకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


