జడ్చర్ల టౌన్: బాదేపల్లి ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పాతబజార్ ఈద్గా వద్ద ముస్లింలు వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ ఇ ఇస్తిస్కా పేరుతో నీటి ఎద్దడి తొలగించేలా అల్లాహ్ నుంచి వర్షం కురిపించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థన చేశారు. ఉదయం 11.5గంటలకు ఈద్గా వద్ద ప్రార్థన ప్రారంభించారు. మౌలాన మహమ్మద్ ఆగిపోద్దిన్, ఆఫీస్ అబ్దుల్ హమీద్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఏమైనా తప్పులు జరిగి ఉంటే మన్నించాలని, వర్షం కురిపించాలని అల్లాను వేడుకున్నారు. ప్రార్థనలో ఈద్గా కమిటీ సభ్యులు అజహర్, ఇంతియాజ్, మోయిజ్, అహ్మద్, సియాదత్ అలీ, నవాజ్, కరీం, మక్బూల్‌తోపాటు పట్టణంలోని ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


