తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

● పాలమూరులో అలరించిన

అలయ్‌.. బలయ్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేదే అలయ్‌ బలయ్‌ అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు నగరం ఆదివారం అలయ్‌.. బలయ్‌ కార్యక్రమానికి వేదికైంది. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌లో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమం అలరించింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు ప్రజలందరూ కలిసికట్టుగా పరస్పర గౌరవంతో మెలుగుతూ నగర ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమం నిర్వహించిన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ప్రతినిధులను అభినందించారు. మరో ముఖ్య అతిథి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కులమతాలకతీతంగా ఐక్యమత్యం, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అయ్యప్ప స్వామి భక్తి, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ కేఎస్‌.రవికుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్‌దేశ్‌పాండే, రాష్ట్ర అధ్యక్షుడు సీమ నరేందర్‌, నరేందర్‌గుప్తా, కీర్తి రాజ్‌గోపాల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement