ఈసారి ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో చాలావరకు నీటి వనరులు ఆశించిన స్థాయిలో నిండలేదు. కేవలం 40 చెరువుల్లో మాత్రమే 50 శాతం నీరు ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. వాటిలోనూ రానున్న కొన్ని నెలల్లో నీరు ఇంకిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు ఎక్కడా చేపపిల్లలను వదలలేదు. అయినప్పటికీ దీనికి సంబంధించి ఆన్‌లైన్ టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తగు నిర్ణయం తీసుకుంటాం.
– రాధారోహిణి,
ఏడీ, జిల్లా మత్స్యశాఖ, మహబూబ్‌నగర్
జిల్లాలో ఈసారి ఎల్‌నినో ప్రభావంతో ఎక్కడా చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఈ కారణంగా నీటివనరుల్లో చేపపిల్లలను వదిలే పరిస్థితి దాదాపు లేకపోవడంతో మత్స్యకార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా వీరికి జీవీ రామ్‌జీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో చేపపిల్లల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం భరించే వంద శాతం సబ్బిడీ డబ్బులను గ్రామీణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయించాలి.
– గోనెల శ్రీనివాసులు, పర్సన్ ఇన్‌చార్జీ, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం
●


