క్యూవీఎస్‌ఈ యాప్‌తో రూ.కోటి మోసం | - | Sakshi
Sakshi News home page

క్యూవీఎస్‌ఈ యాప్‌తో రూ.కోటి మోసం

Oct 24 2026 9:20 AM | Updated on Oct 24 2026 9:20 AM

క్యూవీఎస్‌ఈ యాప్‌తో రూ.కోటి మోసం అమ్రాబాద్‌లో రూ.5 కోట్ల వసూళ్లు విచారణ చేపడుతున్నాం..

ఉప్పునుంతల మండలం కంసానిపల్లికి చెందిన ఓ మహిళ యాప్‌ ద్వారా 40 మందితో రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టించారు. రోజుకు రూ.లక్షకు రూ.వెయ్యి ఆదాయం వస్తుందని నమ్మించారు. విత్‌డ్రా నిలిచిపోవడం, యాప్‌ మూతపడటంతో సుమారు రూ.కోటి మోసపోయినట్లు బాధితులు సెప్టెంబర్‌ 25న ఏజెంట్‌ను నిలదీశారు. అప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

లక్ష్మాపూర్‌కు చెందిన గంటల తిరుపతి హైదరాబాద్‌లో డైలీ ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నానని నమ్మించి అధిక వడ్డీ ఆశ చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముందుగా కొందరికి వడ్డీ చెల్లించి నమ్మకం కలిగించి, తర్వాత అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో బాధితులు సెప్టెంబర్‌ 30న పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.5 కోట్ల మేర మోసం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిట్టీలు, అధిక వడ్డీ, యా ప్‌ల ద్వారా నష్టపోయిన బాఽధితులు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి సమగ్ర వి చారణ చేపడుతున్నాం. అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్‌లో ఇటీవల వెలుగు చూసి ఘటనలలో మోసపోయిన బాధితుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నా యి. అధిక వడ్డీలకు ఆశ పడి ఇతరుకు డబ్బులు ఇవ్వొద్దు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలి.అధిక వడ్డీ ఆశ చూపే వారి వివరాలను ముందుస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

– పల్లె శ్రీనివాసులు, డీఎస్పీ, అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement