భూత్పూర్: మున్సిపాలిటీలోని శేరిపల్లి(బి) వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. శేరిపల్లి (బి) వద్ద జాతీయ రహదారిపై షాద్నగర్ నుంచి తమిళనాడుకు వెళ్తున్న కంటైనర్లో శబ్ధం రావడాన్ని గమనించిన భూత్పూర్ పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. కంటైనర్లో ఏం లోడ్ తరలిస్తున్నారని డ్రైవర్ నిజాంఖాన్ను విచారించి డోర్ తెరవగా అందులో 29 ఎద్దుల కాళ్లను తాళ్లతో బందించడంతోపాటు ఆహారం వేయకుండా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎద్దుల తరలింపునకు నెలాంటి పత్రాలు లేకపోవడంతోపాటు పశువులను బంధించి క్రూరంగా ిహింహసించడంపై డ్రైవర్, యజమాని నిజాంఖాన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు.


