సామాన్యులే టార్గెట్‌! | - | Sakshi
Sakshi News home page

సామాన్యులే టార్గెట్‌!

Oct 24 2026 9:20 AM | Updated on Oct 24 2026 9:20 AM

అచ్చంపేటలో రూ.12 కోట్ల టోకరా

● అధిక వడ్డీ ఆశ చూపి కోట్లలో టోకరా

● క్యూవీఎస్‌ఈ యాప్‌ నుంచి తన్విత

ఆయుర్వేద నిలయం వరకు మోసాల పరంపర

● తన్విత మోసంలో 200 మంది బాధితులు..

రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు

● పోలీసులను ఆశ్రయిస్తున్నా అందని సొమ్ము..

ఆందోళనలో బాధితులు

అచ్చంపేట: అధిక వడ్డీ ఆశ చూపి సామాన్యుల సొ మ్మును కొల్లగొడుతున్న మోసగాళ్లు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెచ్చిపోతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, భూములు కోల్పోయిన నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కొంతకాలం వడ్డీ చెల్లించి నమ్మకం కలిగించడం.. ఆ త ర్వాత అసలుతో సహా చెల్లింపులు నిలిపివేయడం.. చివరకు బోర్డు తిప్పేయడం పరిపాటిగా మారింది. అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్‌ ప్రాంతా ల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలతో పాటు గతంలో జరిగిన మోసాలు ఇదే తీరును వెల్లడిస్తున్నాయి.

లక్కీ స్కీమ్‌ పేరుతో రూ.3 కోట్లు

2022లో అచ్చంపేట, లింగాల, బల్మూరు, ఉప్పునుంతల మండలాల్లో నగదు, కార్లు, బైకులు, బంగారం, వాషింగ్‌ మిషన్లు ఇస్తామని చెప్పి వేలాది మంది నుంచి నెలకు రూ.1,000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు రూ.3 కోట్లు సేకరించి, గడువు ముగిసినా బహుమతులు, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు.

ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌ కేసు

నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌కు చెందిన సాయిబాబు అధిక వడ్డీ పేరుతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్వాసితులు సహా సుమారు 1,200 మంది నుంచి రూ.50 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్లుగా బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, బెయిల్‌పై విడుదలైన తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్నట్లు సమాచారం.

గ్రోల్యాండ్‌ కంపెనీ మోసం

రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.25 వేల వడ్డీ ఇస్తామని నమ్మించి 50 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు 2025 మే 7న నమోదైన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడిపల్లికి చెందిన రిటైర్డ్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మాసయ్యకు పరిచయమైన రోహన్‌, అదిల్‌ ద్వారా బాధితులు పెట్టుబడులు పెట్టారు. కొన్నాళ్లు వడ్డీ చెల్లించిన నిర్వాహకులు తర్వాత నిలిపివేశారు. ఈ కేసులో రోహణ్‌, అదిల్‌, అలీ, రాము అరెస్టయ్యారు.

ఫైనాన్స్‌ సంస్థలు, చిట్టీల ద్వారా పరిచయాలు పెంచుకుని అధిక వడ్డీ ఆశ చూపి నిధులు సేకరించడం, వాటిని రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం, నష్టాలు వచ్చినప్పుడు చెల్లింపులు నిలిపివేయడం వంటి ఆరోపణలు వినిపిస్తు న్నాయి. బాధితులు పెళ్లిళ్లు, పిల్లల భవిష్య త్‌ కోసం దాచుకున్న సొమ్మును కోల్పో తున్నారు. ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, నిందితులు పట్టుబడినా నగదు రికవరీ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనధికార వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలపై పర్యవేక్షణ పెంచి, బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

సాయినగర్‌ కాలనీకి చెందిన సలీం అధిక వడ్డీ ఆశ చూపి సుమారు 70 మంది నుంచి రూ.లక్ష నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ.12 కోట్ల మేర మోసం చేసి సెప్టెంబర్‌ 23న పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement