రోడ్డుప్రమాదంలో యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో యువకుడు దుర్మరణం

Oct 24 2026 9:20 AM | Updated on Oct 24 2026 9:20 AM

అచ్చంపేట రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన సోనమోని అల్లాజి అచ్చంపేటలో కోర్టు కేసు నిమిత్తం హాజరై తిరిగి గ్రామానికి వస్తుండగా.. లింగోటంతండా సమీపంలో ఉప్పునుంతల నుంచి ఎదురుగా వస్తున్న ఓ బొలేరో బలంగా ఢీకొట్టింది. అల్లాజీ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. ఆస్పత్రిలో చేర్చి వైద్య పరీక్షలు ప్రారంభించే సమయంలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య జంగమ్మతోపాటు ముగ్గురు కూతుళ్లున్నారు. బొలేరోను అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడి భార్య అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

చికిత్స పొందుతూ మహిళ మృతి

మరికల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మరికల్‌ మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన వెంకటమ్మ (42) భర్తతో కలిసి నర్వ మండలంలోని యాంకి గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా నర్వ శివారులో ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్‌ వీరిని ఢీకొట్టింది. దీంతో వెంకటమ్మ తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement