జడ్చర్ల రైల్వేస్టేషన్‌లో జోరుగా ఎఫ్‌ఓబీ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

జడ్చర్ల రైల్వేస్టేషన్‌లో జోరుగా ఎఫ్‌ఓబీ నిర్మాణం

Oct 24 2026 9:20 AM | Updated on Oct 24 2026 9:20 AM

జడ్చర్ల: స్థానిక రైల్వేస్టేషన్‌లో శుక్రవారం శరవేగంగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ) నిర్మాణం పనులు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా భారీ క్రేన్ల సహాయంతో మొదటి, రెండు, మూడు ఫ్లాట్‌ఫాంల మధ్య ఎఫ్‌ఓబీని నిర్మించారు. ఎఫ్‌ఓబీకి అనుసంధానంగా లిఫ్ట్‌, ర్యాంపు సౌకర్యం కూడా కల్పించే విధంగా రైల్వే శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో ప్లాట్‌ఫాంల పైకి వెళ్తున్న క్రమంలో ప్రయాణికులు రైలు ప్రమాదాలకు గురై మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఎఫ్‌ఓబీ ఏర్పాటుతో ప్రయాణికుల భద్రతకు భరోసా కలుగుతుంది. అంతేగాక వృద్ధులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement