క్షణికావేశం.. ఎంత పని చేసింది! | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. ఎంత పని చేసింది!

Oct 24 2026 9:20 AM | Updated on Oct 24 2026 9:20 AM

● పొలం వద్ద మోటారు విషయంలో

అన్నదమ్ముల ఘర్షణ

● అన్న కర్రతో దాడి చేయడంతో

తమ్ముడి మృతి

● అచ్చంపేట మండలం

బక్కలింగాయపల్లిలో ఘటన

అచ్చంపేట రూరల్‌: పొలం వద్ద మోటారు ఆన్‌ చేసిన విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం విషాదాంతమైంది. క్షణికావేశంలో అన్న దాడి చేయడంతో తమ్ముడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం బక్కలింగాయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, సిద్దాపూర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కేతావత్‌ బావుసింగ్‌, ఆయన తమ్ముడు కేతావత్‌ మోహన్‌ (35) మధ్య పొలానికి నీరు పెట్టే విషయంలో గొడవ జరిగింది. మోహ న్‌ పొలం వద్ద మోటారు ఆన్‌ చేయడంపై బావుసింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బావుసింగ్‌ కర్రతో మోహన్‌ తలపై కొట్టినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మోహన్‌ను కుటుంబసభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నపాటి వ్యవసాయ వివాదం అన్నదమ్ముల కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement