బతుకమ్మ వద్ద కోలాటం వేస్తున్న ఎంపీ డీకే అరుణ, మేయర్ మమత, ఎమ్మెల్యే సతీమణి లక్ష్మిప్రసన్న
బతుకమ్మతో జిల్లా జడ్జి
ప్రేమలత
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి గ్రాడ్యుయేట్ను కలిసి ఓటరుగా తప్పక నమోదు చేయించాలన్నారు. పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్రెడ్డి గెలుపు దీనిపైనే ఆధారపడి ఉందన్నారు. అందరూ బాధ్యతతో వ్యవహరించి వచ్చే నెల 6వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎండబెట్టిన బీఆర్ఎస్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ నేతలకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఈ మూడేళ్ల ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువత నిరాశ, నిస్పృహలకు గురి కావద్దని, త్వరలోనే రాజీవ్ యువ వికాస్ పథకం అమలు కానుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం


