● అన్నమయ్య సంకీర్తనల ఆలాపనలో అర్ధ శతాబ్దపు అనుభవం
● తిరుమల తిరుపతిలో 169 పర్యాయాలు సంగీత కచేరీలు
● వెయ్యి ఇళ్లలో సప్తగిరి సంకీర్తనల గానామృతం
● కన్నడ దాసర పదగళతో ఇంటింటా భక్తి సంగీతం
● సాక్షితో సంగీత విద్వాంసుడు గద్వాల చంద్రశేఖరరావు
అన్నవరం దేవస్థానం, చైన్నెలోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్, మన్యంకొండ, కురుమూర్తి దేవస్థానాలు, చిన్నజీయర్ స్వామి మఠం, చింతరేవుల, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 30 మంది శిష్య బృందంతో అన్నమయ్య సంకీర్తనలను ఆలపించాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లోనూ సంకీర్తనలను గానం చేసే అవకాశం లభించింది. జూన్ 5న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాను. నా చివరి శ్వాస వరకు అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ, ఆధ్యాత్మిక సంగీత సేవలోనే కొనసాగాలన్నది నా ఆకాంక్ష.
సంగీతాన్ని అందరికీ చేరువ చేయాలనే సంకల్పంతో 2006లో మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో అన్నమయ్య సంగీత వాణి లలిత విద్యాలయాన్ని స్థాపించాను. 11 నుంచి 16 ఏళ్ల వయసున్న విద్యార్థులకు సప్తగిరి సంకీర్తనల్లో శిక్షణ ప్రారంభించాను. ‘మీ ముంగిట అన్నమయ్య సంకీర్తన’ కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం ఏడు సంకీర్తనల చొప్పున దాదాపు వెయ్యి ఇళ్లలో గానసేవ అందించాను. ప్రతి ఏకాదశి రోజున కన్నడ దాసర పదగళను ఆలపించడంతో పాటు, ‘సప్తాహం’ పేరిట ప్రతి నెలా ఒక ఇంట్లో ఏడు సంకీర్తనలను గానం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను.
వెయ్యి ఇళ్లలో సప్తగిరి సంకీర్తనలు
పలుచోట్ల సంగీత కచేరీలు


