క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించాలి

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

పాలమూరు: రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను స్క్రీనింగ్‌ ద్వారా తొలిదశలోనే గుర్తించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యాధులు నిర్ధారణైన వారికి క్రమం తప్పకుండా చికిత్స అందేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలన్నారు. క్షయ లక్షణాలున్నవారిని కఫం, ఎక్స్‌రే పరీక్షల ద్వారా గుర్తించి ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 4 వరకు లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శశికాంత్‌, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

డెంగీ బాధిత బాలుడికి పరామర్శ

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్న బాదేపల్లికి చెందిన బాలుడిని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాసులు, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా ఆజ్మీరా శనివారం పరిశీలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. బాధితుడి ఇంటి సమీపంలో యాంటీలార్వా కార్యక్రమం నిర్వహించి, ప్రజలకు డెంగీపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement