విలయకారిణి.. కాళరాత్రి | - | Sakshi
Sakshi News home page

విలయకారిణి.. కాళరాత్రి

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

అలంపూర్‌: అసుర సంహారిణి కాళరాత్రి మాత నమోస్తుతే.. అంటూ భక్తులు అమ్మవారిని కీర్తించారు. అలంపూర్‌ క్షేత్రంలో దసరా దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల 7వ రోజు జోగుళాంబ అమ్మవారు కాళరాత్రి దేవి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. 5వ శక్తి పీఠ ఆలయంలో ప్రత్యేక మండపంలో కాళరాత్రి మాతను కొలువుదీర్చారు. అర్చకస్వాములు కాళరాత్రి మాతకు కొలువు పూజలు చేశారు. అమ్మవారికి విశేషంగా కుమారి పూజ, సువాసిని పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, మహా మంగళహారతి సమర్పించారు.

యాగశాలలో నిత్య హోమాలు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో నిత్యహోమ పూజలు జరిగాయి. అమ్మవారి ఆలయంలో సాముహిక చండీహోమాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రత్యేక చండీహోమ పూజలు భక్తులు నిర్వహించారు. కుంకుమార్చన మండపంలో త్రీశతి నామ కుంకుమార్చనలు, నవావరణ అర్చనలు, సహస్రనామ అర్చనలు, పారయణం విశేషంగా జరిగాయి.

అలంపూర్‌లో నవరాత్రి ఉత్సవాల్లో

సాంస్కృతిక ప్రదర్శనలు

కాళరాత్రి దేవిగా జోగుళాంబ మాత దర్శనం

క్షేత్రానికి భారీగా తరలొచ్చిన భక్తజనం

జోగుళాంబ మాతకు పట్టువస్త్రాలు సమర్పణ

ఆలయంలో విశేష పూజలు, నిత్యహోమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement