పాలమూరులో బతుకమ్మ కళ ఉయ్యాలో.. | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో బతుకమ్మ కళ ఉయ్యాలో..

Oct 17 2026 6:54 AM | Updated on Oct 17 2026 6:54 AM

బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు

‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పూలన్నీ చేరి ఉయ్యాలో.. పాలమూరులో బతుకమ్మ పండుగ కళ ఉయ్యాలో..’’ పాటలతో మహబూబ్‌నగర్‌ పూలవనంగా మారింది. కలెక్టరేట్‌, ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం, పాలమూరు యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వేడుకలను ప్రారంభించగా, మహిళా ఉద్యోగినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి లక్ష్మీ ప్రసన్న, మేయర్‌ మమత వేడుకల్లో పాల్గొన్నారు. పీయూలో విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగాఆడిపాడగా, అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిలిచాయి. కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ప్రవీణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

– జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌)/మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌

బతుకమ్మలను పేరుస్తున్న విద్యార్థినులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement