నవంబర్‌ 10 నుంచి కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 10 నుంచి కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు

Oct 17 2026 6:54 AM | Updated on Oct 17 2026 6:54 AM

● జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

● అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

● కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

జడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌): చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ సమీపంలోని శ్రీ కురుమూర్తిస్వామి దేవస్థానంలో నవంబర్‌ 10 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఎ మ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా ముందస్తు కార్యాచరణతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, వైద్య శిబిరాలు ఏర్పా టు చేసి 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని సూచించారు. పోలీసు బందోబస్తు పటిష్ఠం చేయడంతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఘాట్‌ రోడ్డు పనులు కొనసాగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతించకుండా చూడాలని సూచించారు. నవంబర్‌ 16న జరిగే ఉద్దాల ఉత్సవానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. నిరంతర విద్యుత్‌ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేపట్టాలని, జాతర ప్రాంతంలో మద్యం విక్రయాలను నియంత్రించాలని అధికారులకు సూచించారు. కురుమూర్తిస్వామి దేవస్థానాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుధ్యం, వైద్యం, రవాణా, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. భక్తులకు సమాచారాన్ని అందించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమైన రోజుల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, విద్యుత్‌ అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్‌ శివాని, అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, ఏఎస్పీ రత్నం, డీఆర్‌ఓ నిర్మల, ఆలయ చైర్మన్‌ బత్తుల బాలరాజు, ఈఓ మదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో 2026లో దొంగతనాలు, రికవరీ ఇలా..

నేరం రకం నమోదైన ఛేదించిన ఛేదింపు నష్టపోయిన రికవరీ చేసిన

కేసులు కేసులు శాతం సొత్తు (రూ.) సొత్తు (రూ.)

ఇళ్ల దొంగతనాలు 103 18 17.47% 96,32,750 17,58,300

దొంగతనాలు 191 62 32.46% 1,68,87,950 7,29,500

దోపిడీలు 6 6 83.33% 3,65,200 2,74,000

మొత్తం 300 86 28.66% 2,68,85,900 27,61,800

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement