● వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
● విశేష పూజలందుకున్న జోగుళాంబ
అలంపూర్: శుభాలనిచ్చే స్కంధ మాత నమోస్తుతే అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. అలంపూర్ క్షేత్రంలోని కొలువైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉ త్సవాల ఐదోరోజు గురువారం జోగుళాంబ అమ్మవారు స్కంధమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యే క మండపంలో కొలువైన స్కంధమాతకు అర్చక స్వా ములు పూజలు చేశారు. ఈ సందర్భంగా స్కందమా త అమ్మవారికి కుమారి పూజ, సువాసిని పూజలు విశేషంగా నిర్వహించారు. స్కంధమాతను పూజిండచం వల్ల కలిగే శుభాల గురించి అర్చక స్వా ములు భక్తులకు వివరించారు. నవరాత్రుల్లో అమ్మవారిని స్కంధమాతగా పూజించడం వల్ల ఒడిదుడుకులు తొలగి పోతాయన్నారు.అమ్మవారిని ఆరాధించడంతో షడ్గుణాలు, సత్ప్రవర్తనలు సిద్ధిస్తాయన్నారు.
చండీహోమాలు
శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక చండీహోమ పూజలు, సామూహిక చండీహోమాజలు నిర్వహించారు. మండపంలో ఆర్జిత సేవలు, త్రిశతి నామ కుంకుమార్చనలు విశేషంగాజరిగాయి. యా గశాలలో మండపారాధన హోమాలు, నిరాజన మంత్ర పుష్పములు వంటి పూజలు చేశారు. నవావరణ అర్చనలు, సహస్రనామ అర్చన అనంతరం మహానివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు.
అలంరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
దేవి శరన్న నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులకు అలరించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టువారు అన్నమయ్య సంకీర్తనలను అలపించారు. సికింద్రబాద్కు చెందిన కీర్తి అకాడమి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి.
ఆలయాలను దర్శించుకున్న ప్రముఖులు
అలంపూర్ క్షేత్ర ఆలయాలను రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ సీఎం హనుమంత రావు దర్శించుకున్నారు. ఈఓ దీప్తి అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు శేషవస్త్రాలతో సత్కరించారు. తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఈఓ దీప్తి ఆయనకు స్వామి అమ్మవారి జ్ఞాపికనుల అందజేశారు. ఆలయాలను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్రెడ్డి సందర్శించారు. స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
అలంపూర్లో అమ్మవారి పూజలకు
హజరైన భక్తులు


