జూరాలకు వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

జూరాలకు వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Oct 16 2026 12:42 AM | Updated on Oct 16 2026 12:42 AM

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం నారాయణపూర్‌ డ్యాం నుంచి 1,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జూరాల నుంచి 1,188 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్‌ డ్యాం నుంచి వారాబందీ ప్రకారం 5వేల క్యూసెక్కుల నీటిని జూరాలకు నాలుగు రోజులుగా వదులుతున్నారు. ప్రస్తుతం 5వేల క్యూసెక్కుల తగ్గించి 1,000 క్యూసెక్కుల నీటిని మాత్రం వదిలారు. జూరాలలో ప్రస్తుతం 3.956 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ సుదర్శన్‌ తెలిపారు. భీమా లిఫ్ట్‌–2కు 750 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 1,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. జూరాలపై ఆధారపడిన లిఫ్ట్‌లకు ఇదివరకే నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు.. బీమా–2తో పాటు సమాంతర కాల్వకు నీటిని ఎందుకు వదులుతున్నారంటూ ఆయకట్టు రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నా సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement