● కోపంతో భర్తను హత్య చేసిన భార్య అరెస్టు
● 20రోజులకు హత్య కేసును ఛేదించిన
పోలీసులు
మరికల్: నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పుటించిన భార్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డీఎస్పీ నల్లపు లింగయ్య గురువారం హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మరికల్ మండలం మాధవరం గ్రామానికి చెందిన తెల్కపల్లి బాలస్వామి(46)కి గ్రామంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెను నేరుగా రాత్రి సమయంలో ఇంట్లోకి తీసుకరావడంతో భార్య రాములమ్మకు నచ్చలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్యన తరచుగా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్తపై కోపం పెంచుకున్న భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. గతనెల 24న అర్ధరాత్రి సమయంలో భర్త బాలస్వామి ఇంట్లో నిద్రిస్తూ బైక్ కోసం ఇంట్లో ఉంచిన పెట్రోల్ను అతడిపై పోసి నిప్పుంటించింది. తీవ్ర గాయలైన భర్తను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించింది. పరిస్థితి విషయమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 25న మృతిచెందాడు. అయితే ఈ విషయంపై భార్య రాములమ్మ తన భర్తను హత్య చేయడానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కత్తితో తనను భయపెట్టించి పెట్రోల్ పోసి నిప్పుంటించి పరారైనట్లు పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది. ఆమె తెలిపిన వివరాలపై పోలీసులకు అనుమానాలు రావడంతో మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని విచరణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఇంటికి పీల్చుకోవడంతో పలుమార్లు ఈ విషయంపై గొడవ పడ్డ తన భర్త అలవాటు మార్చుకోకపోవడంతో కోపంతో పెట్రోల్ పోసి నిప్పుంటించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు.


