మరో వారంలో సంగమేశ్వరుడి పూర్తి దర్శనం | - | Sakshi
Sakshi News home page

మరో వారంలో సంగమేశ్వరుడి పూర్తి దర్శనం

Oct 16 2026 12:42 AM | Updated on Oct 16 2026 12:42 AM

కొల్లాపూర్‌ రూరల్‌: కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో నీట మునిగిన ప్రాచీన సంగమేశ్వరాలయం క్రమంగా బయటపడుతోంది. కొల్లాపూర్‌ మండలం సోమ శిల గ్రామ సమీపంలో, కృష్ణానది అవతలి ఒడ్డున సప్తనదుల సంగమ ప్రదేశంలో కొలువుదీరిన సంగమేశ్వర స్వామి ఆలయ గర్భగుడి తాజాగా నీటిపైకి తేలింది. గర్భగుడి బయటపడటంతో ఆలయ ప్రధాన అర్చకులు రఘురామ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్పర్శ దర్శనం చేసుకున్నారు. శ్రీశైలం నీటిమట్టం 841 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వరాలయం క్రమంగా బయటపడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో వారంలో ప్రాచీన సంగమేశ్వరాలయం పూర్తిస్థాయిలో కనిపించే అవకాశం ఉందని ఆలయ అర్చకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement