మైక్రోబయోలజీలో ఇద్దరికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

మైక్రోబయోలజీలో ఇద్దరికి డాక్టరేట్‌

Oct 16 2026 12:42 AM | Updated on Oct 16 2026 12:42 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ మైక్రోబయోలజీ డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు స్కాలర్స్‌కు ఒకే రోజు డాక్టరేట్‌లను ప్రధానం చేశారు. ఈ మేరకు భావన లక్ష్మీ ‘స్క్రీనింగ్‌ ఫర్‌ పొటెన్షియల్‌ ఫాస్పెట్‌ సొలుబలైజింగ్‌ బ్యాక్టిరియా ఇన్‌ రైజోఫరిక్‌ సాయిల్స్‌ ఆఫ్‌ సర్టెన్‌ లెగ్యూమి’ అనే అంశంపైగా గత కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్‌ చేసి పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఆమెతోపాటు మరో రీసెర్చ్‌ స్కాలర్‌ శ్వేత ఏ స్టడీ ఆన్‌ మైక్రోబయోల్‌ ఎంజైమ్స్‌ అండ్‌ దేర్‌ అప్లికేషన్స్‌ అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. వీరు ప్రొఫెసర్‌ పిండి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో తమ రీసెర్చ్‌ని పూర్తి చేశారు. పీయూ వీసీ శ్రీనివాస్‌ వారిని అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేల పరిరక్షణ, పర్యావరణ హితమైన వ్యవసాయం వంటి అంశాలు ఎంతో ప్రముఖ్యతను సంతరించుకున్నాయని, భవిష్యత్‌లో పర్యావరణ హితమైన మరిన్ని పరిశోధనలు చేయాలని సూచించారు. ఈ మేరకు వీరు శుక్రవారం ప్రొఫెసర్‌ ముంజా శ్రీనివాస్‌ ఆద్వర్యంలో వైవోస్‌ పూర్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ మధుసూదన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కిషోర్‌, శాంతిప్రియ, మృదుల తదితరులు పాల్గొన్నారు.

మిశ్రమ పంటల సాగుతో అధిక దిగుబడులు

మహబూబ్‌నగర్‌ ( వ్యవసాయం): మిశ్రమ పంటల సాగుతో అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) పరిధిలోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌), హైదరాబాద్‌ సబర్బన్‌ అడ్వాన్స్‌డ్‌ ఫార్మింగ్‌ కార్యక్రమంలో భా గంగా జిల్లాలోని రైతులకు ఆధునిక వ్యవసా య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 80 మంది రైతులు, 60 మంది మహిళా రైతులు మొత్తం 140 మంది పాల్గొనగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని డీడీ ఏ (ఎఫ్‌టీసీ) కార్యాలయం ఆధ్వర్యంలో మిశ్ర మ పంటల సాగు విధానాలు, అంతర పంటల ప్రాధాన్యం, పంటల మార్పిడి, పంటల వైవిధ్యం, భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై వివరించారు. సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు శాసీ్త్రయ విధానాలను అనుసరించడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

ఆటో బోల్తా..

మహిళ దుర్మరణం

గద్వాల క్రైం: ఆటో బోల్తా పడడంతో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గద్వా ల మండలం గోనుపాడు గ్రామ శివారు లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ధరూరు మండలం గూడెందొడ్డికి చెందిన ఆటో డ్రైవర్‌ తిమ్మప్ప బంధువులతో కలిసి ఆటోలో గద్వాలకు బయలుదేరారు. గోనుపా డు శివారులో ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్ర మాదంలో లావణ్య (34) అక్కడికక్కడే మృతిచెందింది. పద్మమ్మ, మా ణిక్యమ్మ, పావని, చిన్నారి వందనతో పాటు ఆటో డ్రైవర్‌ తిమ్మప్పకు గాయాలు కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో పావని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆటోలో 8 మందికి పైగా ప్రయాణిస్తుండగా..డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమా దం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement