24 గంటల్లో ఛేదించారు.. | - | Sakshi
Sakshi News home page

24 గంటల్లో ఛేదించారు..

Oct 3 2026 12:56 AM | Updated on Oct 3 2026 12:56 AM

ఆమనగల్లు: దేవాలయాల్లో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువులు చోరీ చేస్తున్న నిందితుడిని ఆమనగల్లు పోలీసులు 24 గంటల్లో అరెస్ట్‌ చేశారు. సాంకేతిక ఆధారాలు, క్లూస్‌టీం, ఫింగర్‌ప్రింట్‌ విభాగం సహకారంతో నిందితుడిని గుర్తించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విఠాయిపల్లి గ్రామ శివారు పెంటతండా గేట్‌ సమీపంలోని హనుమాన్‌ దేవాలయం, పెద్దమ్మ దేవాలయంలో సెప్టెంబర్‌ 29 రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి, తాళాలు పగుల గొట్టి పలు వస్తువులు చోరీ చేశాడు. 30వ తేదీ ఉదయం హనుమాన్‌ దేవాలయానికి వచ్చిన ఆలయ పూజారి సభవట్‌ లక్ష్మణ్‌స్వామి తాళాలు విరుగ్గొట్టి ఉండడం చూసి ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, క్లూస్‌టీం, ఫింగర్‌ ప్రింట్‌ విభాగం సహకారంతో విశ్లేషించి నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంటరావుపల్లి గ్రామానికి చెందిన పెద్దముక్కల ఈశ్వర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పెద్దకొత్తపల్లి, పాన్‌గల్‌, గంట్రావుపల్లి, కందుకూరు ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.1.65 లక్షల విలువైన వెండి మీసాలు, నోరు, కళ్లు, ఇత్తడి దీపాలు, గంటలు, మంగళహారతులు, శఠ గోపం, రాగి వస్తువులు, బంగారుపూత వస్తువులు, మోటార్‌సైకిల్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రి మాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ రాంరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ రాజేందర్‌, కానిస్టేబుల్స్‌ శివకుమార్‌, మల్లయ్యలను డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకీరెడ్డి అభినందించారు.

● ఆలయాల్లో చోరీ: నిందితుడి అరెస్ట్‌

● సాంకేతిక ఆధారాలు, క్లూస్‌టీం, ఫింగర్‌ ప్రింట్‌ విభాగంతో కేసు ఛేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement