వెల్దండ: భారత రాజ్యాంగం కల్పించిన బీసీ హక్కుల సాధన కోసం పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడు పేర్కొన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీకి చెందిన ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీలేదన్నారు. బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ మోసానికి గురి చేస్తున్నారన్నారు. దేశంలో బీసీ కులగణన చేపట్టాలని పదేళ్లుగా పోరాట ఫలితంగా తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో పూర్తి చేసిన దేశవ్యాప్తంగా చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు దేశవ్యాప్తంగా తీరని అన్యాయానికి గురవుతున్నారన్నారు. రాజ్యాంగ బద్దంగా కల్పించాల్సిన హక్కులను అమలు చేయకుండా జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందన్నారు. బీసీల నోట్లో మట్టి కొడుతూ చిన్నచూపు చూస్తుందన్నారు. నవంబర్ నెలలో జరిగే పార్లమెంట్ శీతకాల సమావేశాలల్లో బీసీ కులగణనకు చేపట్టేందుకు తీర్మానం చేయాలని లేకుంటే పార్లమెంట్‌ను ముట్టడిస్తాని హెచ్చరించారు. ఈనెల 8న ఢిల్లీలో బీసీల జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌ముదిరాజ్, ఉపాధ్యాక్షులు భాస్కర్, కార్యదర్శి రాజు తదితరులు ఉన్నారు.


