మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి (గద్వాల, వనపర్తి జిల్లాలు మినహా) సీనియర్ పురుషుల, మహిళా ఫుట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని కోరారు. జిల్లా క్రీడాకారులు క్రమశిక్షణతో కష్టపడి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్, సభ్యులు సూర్యప్రకాశ్, నాగేశ్వర, నందకిషోర్, శంకర్, ఇమ్మాన్యుయెల్ జేమ్స్, రామకృష్ణ, ఖేలో ఇండియా సెంటర్ ఫుట్‌బాల్ కోచ్ నికేష్ తదితరులు పాల్గొన్నారు.


