● టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి
● మొదటిరోజు 4 డిపోల పరిధిలో
ఎన్నికల ప్రచారం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: టీజీఎస్ ఆర్టీసీలో ఈనెల 9న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ యూ అలయెన్స్‌ను గెలిపించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి కోరారు. ఈ ఎన్నికల లో భాగంగా మొదటిరోజు గురువారం రీజియన్ పరిధిలోని మహబూబ్ నగర్, కల్వకుర్తి, కొల్లాపూ ర్, అచ్చంపేట డిపోలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావాలంటే తమ గెలుపుతోనే సాధ్యమన్నారు. కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగ భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించామన్నా రు. సర్వీస్ కండీషన్లు, మెరుగైన పే స్కేల్, పని భారం తగ్గింపునకు తాము రాజీలేని పోరాటం చే స్తామన్నారు. ఈసారి రాష్ట్రస్థాయి గుర్తింపు (క్లాస్– 3) లో భాగంగా ‘బస్సుశ్రీకు, రీజియన్ స్థాయి (క్లాస్–6) లో ‘నిచ్చెన’ సింబల్‌కు ఓటు వేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. టీఎంయూ ఆవిర్భావం నుంచి ఉన్న బాణం గుర్తును ప్రభుత్వం, అధికారులతో అశ్వత్థామరెడ్డి కుమ్మకై ్క టీడబ్ల్యూయూ కూటమికి కేటాయించేలా కుట్రలు పన్నారని ఆరోపించారు. ఆయా కార్యక్రమాలలో ఈయూ కూటమి నాయకులు కమాల్‌రెడ్డి, రాఘవరెడ్డి, యాదయ్య, జి.లక్ష్మణ్‌గౌడ్, సాయిరెడ్డి, బసప్ప, తెలకపల్లి రాములు, దారా సుందర్, ఎంఆర్‌గౌడ్, బాలశివుడు, టీఆర్‌సీ రెడ్డి, రవీందర్‌రెడ్డి, చిట్టెమ్మ, వీపీ లత, అమరేశ్వరి, రాగిణి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


