అమ్మాయిల భద్రతపై నిరంతర నిఘా: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

అమ్మాయిల భద్రతపై నిరంతర నిఘా: ఎస్పీ

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: మహిళలు, విద్యార్థుల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా షీటీం బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. సెప్టెంబర్‌లో షీటీంకు మొత్తం 17 ఫిర్యాదు లు అందినట్లు వెల్లడించారు. ప్రతి రోజు మహిళా పోలీస్‌స్టేషన్‌ అధికారులతో పాటు ప్రత్యేక సిబ్బంది షీటీంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రధాన రద్దీ ప్రాంతాల్లో నిఘా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యా దులపై స్పందించిన బృందా లు 16 మందికి కౌన్సెలింగ్‌, 13 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఒక ఫిర్యాదు అందగా, మూడు పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నెలలో 35 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు 50 హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో నిఘా కొనసాగించినట్లు వివరించారు. ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌, పోక్సో చట్టం, గుడ్‌టచ్‌–బ్యాడ్‌టచ్‌, బాల్య వివాహాలపై విద్యార్థులు, మహిళలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా వేధింపులకు గురైనా, ఇబ్బందులు ఎదురైనా వెంటనే 8712659365 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement