పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

● సీఎం హామీలు అమలు చేయకుండా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే పనిలో బిజీ

● ఎంపీ డీకే అరుణ

పాలమూరు: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ప్రతి పట్టభద్రుడితో సంప్రదింపులు జరిపి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టకుండా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తరచూ ఢిల్లీ పర్యటనలు, దేవుళ్లకు సంబంధించిన అంశాలపై వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు చేశారు. పట్టభద్రుల ఓటు నమోదు, వినియోగంపై కార్యకర్తలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ నేతలు పద్మజారెడ్డి, డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అంజయ్య, ఎగ్గని నర్సింహులు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement