స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అందరూ భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అందరూ భాగస్వాములు కావాలి

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పిల్లలమర్రి ప్రాంగణంలో గురువారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతాహీ సేవ’ నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడి పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం నగర మేయర్‌ జి.మమత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌, స్వచ్ఛతా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, లక్ష్మయ్య, ఎస్‌బీఎం కన్సల్టెంట్‌ సుమీత్‌రాజ్‌తో పాటు పీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1 విద్యార్థులు, ఎస్‌బీఐ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజం

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని మేయర్‌ జి.మమత అన్నారు. గురువారం టీడీగుట్ట–6 అంగన్‌వాడీ కేంద్రంలో ‘పోషణ మాసం’, పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ రూపారాణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement