జర్నలిస్టులు ప్రజలకు.. ప్రభుత్వానికి వారధులు | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులు ప్రజలకు.. ప్రభుత్వానికి వారధులు

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఎస్వీఎస్‌ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ సౌజన్యంతో జర్నలిస్టు కుటుంబాలకు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్‌ క్యాంప్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి అందరూ అండగా నిలవాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఎస్వీఎస్‌ యాజమాన్యాన్ని అభినందించారు. జర్నలిస్టులు పని ఒత్తిడి, న్యూస్‌ కాంపిటీషన్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎస్వీఎస్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ కేజీ రెడ్డి తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి తదితర సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో రూ.80 కోట్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలను అభి వృద్ధి చేస్తున్నామని తెలిపారు. మేయర్‌ మమత, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు నరేందర్‌ చారి, జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్‌, ఆస్పత్రి రెసిడెంట్‌ డైరెక్టర్‌ రామిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement