గ్రామసభలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గ్రామసభలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): వీబీజీ రామ్‌జీ కింద శుక్రవారం నుంచి నిర్వహించనున్న గ్రామసభలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వెబెక్స్‌ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో గ్రామసభల ఏర్పాట్లు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గ్రామసభలకు అవసరమైన ఏర్పాట్లన్నింటినీ ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిర్దేశిత కార్యక్రమం ప్రకారం గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. డీఆర్‌డీఓ నర్సింహులు, గృహ నిర్మాణశాఖ పీడీ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మార్గదర్శకాలు పాటించాలి

ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియలో నోటీసుల పరిష్కారానికి మార్గదర్శకాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి వీసీ నిర్వహించారు. నోటీసులు అందిన ఓటర్లు హియరింగ్‌కు రావాల్సిన అవసరం లేదని, బీఎల్‌ఓలు ఇళ్లకు వెళ్లి పత్రాలు సేకరించి ఈసీఐ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారని తెలిపారు. పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులకు హెల్ప్‌డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీసీలో అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఆర్‌డీఓ నవీన్‌, డీటీలు జాఫర్‌, సునీల్‌, శ్రీనివాస్‌, బాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement