గాంధీజీ విగ్రహం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

గాంధీజీ విగ్రహం ధ్వంసం

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

అలంపూర్‌: మున్సిపాలిటీలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇటీవల మున్సిపాలిటీ ప్రధాన రోడ్డులో డివైడర్‌ నిర్మాణం చేపట్టడంతో అక్కడ ఉన్న గాంధీజీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఈ విగ్రహాన్ని అధికారులు డంప్‌ యార్డుకు తరలించి నిర్లక్ష్యంగా వ దిలేశారని ప్రజాప్రతినిధులు, నాయకులు ఆరోపించారు. డంప్‌ యార్డులో దుండగులు మహాత్ముడి విగ్రహాన్ని, దిమ్మెను ధ్వంసం చేశారు. సోషల్‌ మీడియా గ్రూప్‌లో పోస్టులు చేయడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి ధ్వంసమైన విగ్రహ భాగాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇద్దరిపై హత్యాయత్నం.. కేసు నమోదు

తిమ్మాజిపేట: తిమ్మాజిపేటలో ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం చేయడంతో బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు సోమవారం రాత్రి తెలిపారు. ఆయన కథనం మేరకు.. తిమ్మాజిపేటలో ఆదివారం అర్ధరాత్రి కొడావత్‌ హర్య, ఆయన కుటుంబసభ్యులు మాట్లాడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన అనుదీప్‌గౌడ్‌ అక్కడకు వచ్చి గొడవ చేయొద్దని వాదనకు దిగాడు. తన తమ్ముడు అఖిల్‌గౌడ్‌ను తీసుకొచ్చి బాధితులతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో అఖిల్‌గౌడ్‌ కత్తెరతో హర్య, వాలులపై దాడి చేయడంతో రక్త గాయాలైనట్లు ఎస్‌ఐ తెలిపారు. గాయపడిన వారిని మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించి విస్లావత్‌ విజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement