రూ.4లక్షలకు లడ్డు దక్కించుకున్న
దంపతులు
జడ్చర్ల టౌన్/తిమ్మాజిపేట: మున్సిపాలిటీలోని అశోక్‌నగర్‌లో శనివారం రాత్రి వినాయక లడ్డూ వేలం రికార్డు స్థాయిలో ధర పలికింది. రిటైర్డ్ ఎంపీడీఓ వేదవతి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపాల్ దంపతులు రూ.4లక్షలకు వేలం పాడారు. శ్రీవేంకటేశ్వర కాలనీలో అధికార పార్టీ నాయకుడు అనంతకిషన్ రూ.2.25లక్షలకు, పద్మావతికాలనీలో కోట్ల ప్రశాంత్‌రెడ్డి రూ.1.85లక్షలకు, తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో లడ్డూను రూ.1.12లక్షలకు కృష్ణారెడ్డి దంపతులు వేలం పాడి దక్కించుకున్నారు.


